English   

సినిమా తెచ్చిన తంటా...బాయ్కాట్ నెట్ ఫ్లిక్స్ అంటూ 

Krishna and His Leela
2020-06-30 16:41:32

మన తెలుగు సినిమాలకి టైటిల్ వివాదాలు ఏమీ కొత్త కాదు. గతంలో కొన్ని సినిమాలు అయితే ఏకంగా రిలీజ్ కు ముందే పేరు మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక రిలీజ్ అయ్యాక మా మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ రచ్చ చేసేవారూ లేకపోలేదు. కానీ ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాని పేరు మీద వివాదం జరుగుతోంది. తాజగా సిద్ధు హీరోగా రవికాంత్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సినిమాలోని ప్రధాన నటీనటులకు హిందూ దేవతల పేర్లను ఉపయోగించి వారిని అవమానించారని రాకేష్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమాకు వ్యతిరేకంగా హిందూవాదులు విరుచుకుపడుతున్నారు. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా కధ ప్రకారం ముగ్గురమ్మాయిలతో కృష్ణ రొమాన్స్ చేస్తాడు. ఆ ముగ్గురమ్మాయిలకి దేవుళ్ల పేర్లు పెట్టి రొమాన్స్ నడిపించడం వల్ల వివాదం మొదలైంది. ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్న కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ను బోయ్‌కాట్ చేయాలనే ప్రచారం కూడా మొదలైందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీంతో ట్విట్టర్‌లో #BoycottNetflix టాప్ ట్రెండింగ్‌ లో ఉంది. మరి దీనికి సినిమా యూనిట్ ఏమని సమాధానం ఇస్తుందో ?

More Related Stories