English   

సోషల్ మీడియాలో సత్తా చూపిస్తున్న హీరోల భార్యలు వీళ్లే..

tollywood
2020-06-30 17:16:03

పేరుకు వాళ్లు హీరోల భార్యలు.. కానీ హౌజ్ వైఫ్‌లుగా మాత్రమే వాళ్లు ఉండట్లేదు. తమకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో భర్తలను మించిన పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. టాలీవుడ్‌లో కొందరు హీరోల భార్యలు సోషల్ మీడియాలో రప్ఫాడిస్తున్నారు.

ఉపాసన కొణిదెల: రామ్ చరణ్ భార్యగా కంటే కూడా ఎక్కువగా అపోలో వైస్ ఛైర్మెన్‌గా ప్రజలకు మరింత చేరువవుతుంది ఉపాసన. మెగా కోడలిగా తన బాధ్యత నిర్వర్తిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్‌గానే ఉంటుంది. 

నమ్రత శిరోద్కర్: మహేష్ బాబును పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రతకు ఉత్తమ గృహిణి అవార్డ్ ఇవ్వాలేమో..? భర్త సినిమాలతో బిజీగా ఉంటే ఈమె ఆయన పనులతో పాటు సోషల్ మీడియాలో కూడా అభిమానులకు అన్ని ముచ్చట్లు చెప్తుంటుంది.

సమంత అక్కినేని: తాను కూడా హీరోయిన్ కావడం వల్ల సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది సమంత. అక్కినేని కోడలిగా మారిన తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగింది. కోటికి పైగా ఇన్‌స్టా ఫాలోయర్స్‌తో రికార్డులు తిరగరాస్తుంది సమంత.

అంజనా: నాని భార్యగా అంజనా చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఈమెకు సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. తాజాగా పాట పాడుతూ అంజనా చేసిన వీడియో వైరల్ అవుతుంది.

అమల అక్కినేని: నాగార్జున భార్యగా తన బాధ్యత నిర్వరిస్తూనే.. మరోవైపు మూగజీవాలను రక్షిస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంది అమల అక్కినేని.

రేణు దేశాయ్: పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే రేణు దేశాయ్ ఇప్పటికీ మన ప్రేక్షకులకు పరిచయం. ఈమె కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. తన వివరాలను అందులో పోస్ట్ చేస్తుంటుంది. 

More Related Stories