English   

వర్మ పై సెటైర్లు వేసిన రామజోగయ్య శాస్త్రి..

 Ramajogayya Sastry
2020-07-01 13:21:15

ఈ ప్రపంచంలో ఎవరు ఇష్టాలతో పని లేకుండా నా ఇష్టం అంటూ తన ఇష్టం వచ్చినట్లు బతికే ఒకే ఒక మనిషి రామ్ గోపాల్ వర్మ అయ్యుంటాడు. పక్కవాడి ఫీలింగ్స్ కు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడు ఈయన. ఆ టైంకి ఏది అనిపిస్తే అది చేస్తుంటాడు. అందుకే కొందరు వర్మ మేధావి అంటారు.. మరికొందరు పిచ్చోడు అంటారు. లాక్‌డౌన్‌ సమయంలో అందరూ ఇంట్లో లాక్ అయిపోతే వర్మ మాత్రం నగ్నం, క్లైమాక్స్, కరోనా వైరస్ అంటూ సినిమాలు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ అంటూ మరో సినిమా కూడా అనౌన్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. 

అక్కడితో చాలదన్నట్లు ఈ సినిమాలో నలుగురు పిల్లలు, ఒక రష్యన్ యువతి, అలాగే 8 బర్రెలు సినిమాలో ఉంటాయని వ్యంగ్యంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇది చూసి పవన్ అభిమానులకు మరింత మండింది. ఇదంతా ఇలా ఉంటే సీనియర్ రైటర్ రామ జోగయ్య శాస్త్రి కూడా ఇప్పుడు వర్మ చేసిన పనిపై రియాక్ట్ అయ్యాడు. తాను కాలేజీ చదివే రోజుల్లో శివుడిని ఆరాధించాక మణిరత్నంని.. ఆ తర్వాత ఆర్జీవీని అంతగా ఆరాధించేవాడినని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. ''మిమ్మల్ని చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏవేవో చేస్తున్నారు. పోండి సార్ మీతో కటీఫ్.. మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు. ఇచ్చినా తెలివిగా ఏదో చెప్పేస్తారు... నేను హర్ట్ అయ్యా'' అని ట్వీట్ చేశాడు రామజోగయ్య శాస్త్రి. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. 

More Related Stories