English   

రజనీకాంత్.. ఇప్పట్లో షూట్ వద్దంటున్నాడు

rajinikanth
2020-07-01 14:06:24

అరవై ఏళ్ళు పైబడిన వయసులో కూడా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ రజనీ గట్టిగా పోటీ ఇస్తున్నాడు. ఇక ఆయన ప్రస్తుతం విశ్వాసం ఫేమ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తమిళంలో అన్నాత్తే పేరుతో వస్తోన్న ఈ సినిమా కూడా అన్ని సినిమాల్లానే కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే షూటింగ్స్ కి పర్మిశంస్ ఇచ్చిన నేపధ్యంలో త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ని స్టార్ట్ చేయనుందట యూనిట్. అయితే వయసు రీత్యా రజినీ ఇప్పట్లో షూట్ లో పాల్గొనడట. కరోనా ప్రభావం తగ్గేవరకూ శివ రజనీ లేని సీన్స్ షూట్ చేయనున్నాడని అంటున్నారు. కరోనా లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుపుకుంది. హైదరాబాద్ షెడ్యూల్ తరువాత ఈ సినిమా కోల్ కతా, పూణేలో షూటింగ్ కి వెళ్ళాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ షెడ్యూల్ ను మారుస్తున్నట్టు అప్పట్లో పేర్కొన్నారు. కుష్బూ, మీనా, కీర్తి సురేష్ లు నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మాస్ హీరోలను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ శివది అందెవేసిన చేయి, మరి ఈ సినిమాలో రజనీని ఎంతలా ఎలివేట్ చేస్తాడో చూడాలి మరి.  

More Related Stories