ఓటిటికి క్యూ కడుతున్న బాలీవుడ్ భారీ సినిమాలు..

తెలుగు దర్శక నిర్మాతల మాదిరి కాదు బాలీవుడ్ వాళ్లు. థియేటర్స్ ఓపెన్ కాకపోతే చేతులు కట్టుకుని కూర్చోరు వాళ్లు. మరో ఆప్షన్ చూసుకుంటున్నారు. కాస్త లాభమో నష్టమో భారీ సినిమాలను కూడా ఆన్లైన్ రిలీజ్ చేస్తున్నారు. ఒకటి రెండు కాదు.. చాలా సినిమాలు ఇప్పుడు ఓటిటిలో విడుదలవుతున్నాయి.
లక్ష్మీ బాంబ్: అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ తెరకెక్కిస్తున్న లక్ష్మీ బాంబ్ సినిమా చాలా కాలం కిందే పూర్తయింది. ఇప్పుడు ఈ సినిమాను హాట్ స్టార్ డిస్నీ కొనేసింది. దాదాపు 150 కోట్లు వెచ్చించి ఈ సినిమా తీసుకున్నట్లు తెలుస్తుంది.
దిల్ బెచారా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా దిల్ బెచారా సైతం జులై 24న హాట్ స్టార్ డిస్నీలోనే విడుదల కానుంది. దీనికి కూడా 80 కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు తెలుస్తుంది.
భుజ్: అజయ్ దేవ్గన్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ భుజ్ కూడా హాట్ స్టార్‌లోనే విడుదలవుతుంది.
సడక్ 2: అలియా భట్, సంజయ్ దత్, వరుణ్ ధావన్ లాంటి భారీ స్టార్ క్యాస్టింగ్‌తో సీనియర్ దర్శకుడు మహేష్ భట్ తెరకెక్కిస్తున్న సడక్ 2 హాట్ స్టార్‌లోనే విడుదల కానుంది.
కూలీ నెం 1: అప్పట్లో గోవిందా నటించిన సూపర్ హిట్ సినిమా కూలీ నెం 1 రీమేక్ 2020 కూలీ నెం 1 కూడా ఓటిటిలోనే రానుంది. వరుణ్ ధావన్ ఇందులో హీరో. సారా అలీ ఖాన్ హీరోయిన్గా నటిస్తుంది.
బిగ్ బుల్: అభిషేక్ బచ్చన్ హీరోగా నటించిన బిగ్ బుల్ చిత్రం కూడా హాట్ స్టార్‌లో దర్శనం ఇవ్వనుంది.
శకుంతలా దేవి: విద్యా బాలన్ కీలక పాత్రలో నటించిన శకుంతలా దేవి అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతుంది. మొత్తానికి ఇప్పుడు బాలీవుడ్ అంతా థియేటర్స్ కోసం కాకుండా ఓటిటిలో మంచి డీల్ వస్తే తమ సినిమాలను ఇచ్చేస్తున్నారు.