English   

బాలీవుడ్ లెజెండ్రీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

Saroj Khan Dies
2020-07-03 10:36:51

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో ముంబై బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరోజ్ ఖాన్ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగింది. ప్రముఖులు సరోజ్ ఖాన్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 2వేల పాటలకు కొరియోగ్రఫీ చేశారు. సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీలో డ్యాన్స్ చేసిన ఎందరో కథానాయికలు...స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. శ్రీదేవి...మాధురీ దీక్షిత్ బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్లుగా ఎదగడంలో సరోజ్‌ ఖాన్‌ కొరియోగ్రఫీది కీలక పాత్ర. మిస్టర్ ఇండియాలో సరోజ్‌ ఖాన్‌ డ్యాన్స్ డైరెక్షన్‌లో శ్రీదేవి వేసిన స్టెప్స్ ఆమెను ఇండియా నెంబర్ వన్ హీరోయిన్‌గా మార్చాయి. నాగినా, చాందినీ సినిమాలతో శ్రీదేవి తెరపై సృష్టించని మ్యాజిక్‌లో సరోజ్ ఖాన్ స్టెప్స్‌ది కీలక పాత్ర. శ్రీదేవి తర్వాత మాధురీ మానియాతో బాలీవుడ్ ఊగిపోయేలా చేసిన ఘనత సరోజ్ ఖాన్‌దే. తేజాబ్‌లో మాధురీ స్టెప్పులేసిన ఏక్‌..దో..తీన్‌ సాంగ్‌ దేశాన్ని ఉర్రూతలూపింది. ఖల్ నాయక్‌ సినిమాలోని ఛోలీ కే పీఛే క్యా హై సాంగ్ సృష్టించిన సంచలనాల గురించి ఇంకెంత చెప్పినా తక్కువే. 

More Related Stories