English   

పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్ష.. ఈ దీక్ష ఎంత కఠినమో తెలుసా ..

 Pawan Kalyan
2020-07-03 17:46:41

నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సును ఆకాంక్షిస్తూ పవన్‌ దీక్షకు పూనారని చెబుతూ జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. నాలుగు మాసాల పాటు పవన్‌ కల్యాణ్‌ దీక్ష కొనసాగుతుందని నిన్న బుధవారం తొలి ఏకాదశి కావడంతో ప్రజల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ ఈ దీక్షను ప్రారంభించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

ఆషాడం, శ్రావణం, భాద్రపదం, అశ్వీయుజమాసం కలిసి నాలుగు మాసాల పాటు ఈ దీక్ష కొనసాగునుంది. పవన్ కళ్యాణ్ దాదాపు రెండు దశాబ్ధాల నుంచి (20 సంవత్సరాలు) ఈ దీక్ష చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీక్షను విరమించే సమయంలో హోమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చాతుర్మాస్య దీక్షలో ఉన్ననంత కాలం పవన్ కళ్యాణ్ మాంసాహారానికి దూరంగా ఉంటారని, మితంగా సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని అందులో పేర్కొనారు. అది కూడా ఒక్కపూట మాత్రమే ఆహారం తీసుకుంటారని వివరించారు. సూర్యాస్తమయం అనంతరం కొద్దిగా పాలు, పండ్ల ఆహారంగా తీసుకుంటారన్నారు. రాత్రి శాకాహార భోజనంతో ఆ రోజుకు దీక్షను ముగిస్తారని అన్నారు.

అసలు చాతుర్మాస్యం అంటే ఏంటంటే త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు శేష శయ్యపై యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. దీనిని మనం శయన ఏకాదశి అంటాము. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుండి మేల్కొంటాడు. దీనిని ఉత్థాన ఏకాదశి అంటాము. ఈనాలుగు మాసాల కాలాన్ని చాతుర్మాస్యం అని అంటారు.శ్రావణ మాసంలో కూరగాయలను, భాద్రపద మాసంలో పెరుగును, ఆశ్వీయుజ మాసంలో పాలు, పాల పదార్ధాలను, కార్తీక మాసంలో పప్పు ధాన్యాలను అనగా రెండు బద్దలుగా విడివడే పప్పులు, పప్పు పదార్ధాలను తినకూడదు. ఎందుకంటే! ఋతువులు మారుతున్నా క్రమములో వ్యాధులు ప్రబలుతాయి. ముఖ్యముగా గ్రీష్మ నుండి వర్ష ఋతువు, శరత్ ఋతువు కాలంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఋతువుల కాలాన్ని యమదంష్ట్రలు అన్నారు.

శాస్త్ర రీత్యా ఆషాడంలో కామోద్దీపం హెచ్చుగా ఉంటుంది. కనుక నూతన దంపతులను దూరంగా ఉంచుతారు. భాద్రపదంలో వర్షాల వలన నీరు బురదమయంగా ఉంటుంది. ఆ నీరు త్రాగడం వలన రోగాల బారిన పడతారు. అజీర్ణం లాంటి వ్యాధులు ప్రాప్తిస్తాయి. వీటిని నియంత్రించడానికి నియమిత ఆహారం, ఉపవాసాలు ఈ నాలుగు మాసాలలో చేయాలి. వీటినే చాతుర్మాస్య దీక్షగా ఆరోగ్య రీత్యా చెప్పడం జరిగింది.

ఈ నాలుగు మాసాల్లో ఎన్నో పండుగలు పర్వదినాల పేరిట కట్టడి చేయడం జరిగింది. వ్రతాలు, మహాలయ పక్షాలు, శరన్నవరాత్రులు, కార్తీక స్నానాలు, శివారాధనలు ఏర్పాటు చేశారు. అందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని హిందూ ధర్మశాస్త్రాలు అకాంక్షిచాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమయమైన కుటుంబ, సాంఘిక వ్యవస్థలతో ప్రజలంతా మనుగడ సాగించాలన్న సదుద్దేశ్యంలో మన పూర్వఋషులు సంస్కృతీ సంప్రదాయాల పేరుతొ ఏర్పరచిన వ్రతం ఇది. జీవితంలో ఒక్కసారి చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తే దాని ఫలితం కలకాలం అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.

More Related Stories