నితిన్ పెళ్లి ముహూర్తం కుదిరింది...కానీ లాక్ డౌన్ అంటే

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో ఉన్న హీరోలలో నితిన్ ఒకరు. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లు అవుతున్నా ఈ యంగ్ హీరో పెళ్లి ఊసే ఎత్తటం లేదని అనుకునేవారు. గతంలో చాలా సార్లు నితిన్ పెళ్లిపై వార్తలు వినిపించినా ఆ వార్తలు అన్నీ పుకార్లుగానే తేలిపోయాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆయన సడన్ గా తన పెళ్లి ప్రకటన చేసేశాడు. నితిన్ పెళ్లాడబోయే అమ్మాయి లండన్ లో ఎంబీఏ చదివిన షాలిని అని ఆ మధ్య ప్రచారం కూడా జరిగింది. నాలుగున్నరేళ్ళగా వీరిద్దరు ప్రేమలో ఉన్న వీరు ఈ ఏడాది ఏప్రిల్ లో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో చేసుకునేందుకు ప్లాన్ చేసి దుబాయ్‌లో ఈ పెళ్లి వేడుక ప్లాన్ చేశారు.
ఏప్రిల్ 16న ముహుర్తం పెట్టుకున్నారు అయితే కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉడటంతో సామాజిక బాధ్యత దృష్ట్యా పెళ్లి వాయిదా వేసుకోవడమే మేలని నితిన్ భావించినా తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో పరిస్థితులు కుదుట పడే అవకాశం లేదని భావించి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ ని క్యాన్సిల్ చేశారు. ఈ నెలలో హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో నితిన్ షాలినిల వివాహం చేయాలని నితిన్ తండ్రి ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట.
షాలిని తో జులై 26 తేదీన పెళ్లి జరుగనుందని అంటున్నారు. ప్రస్తుతం మళ్ళి లాక్ డౌన్ విధించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది దీంతో ఒక వేళ విధిస్తే ప్రత్యేక అనుమతులు తీసుకుని పెళ్లి పూర్తి చేయచ్చని అంటున్నారు. నితిన్ వరుసగా సినిమాలు అంగీకరించాడు. ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా రిలీజ్ కాగా, రంగ్‌దే, చంద్రశేఖర్ ఏలేటి, కృష్ణ చైతన్యల దర్శకత్వంలో కూడా సినిమాలు చేసేందుకు అంగీకరించాడు.