English   

సోషల్ మీడియాలో మహేష్ రేర్ ఫీట్..మరో రికార్డు

 Mahesh Babu
2020-07-03 11:20:00

ఈ మధ్య మనందరి జీవితాల్లో సోషల్ మీడియా ఒక భాగమై పోయింది. ఎంతగా అంటే ఏమి చేస్తున్నా చూస్తున్నా అది సోషల్ మీడియా కోణం నుండి చూసేంతగా. ఇక ఈ సోషల్ మీడియా ప్రముఖులకి బాగా ఉపయోగపడుతోంది. తమ తమ అభిమానులతో టచ్ లో ఉండడానికి ఈ వేదిక బాగా ఉపయోగపడుతోంది. ఈ సోషల్ మీడియాలో తెలుగులో బాగా యాక్టివ్ గా ఉండే హీరో ఎవరంటే టక్కున మహేష్ బాబు అని చెప్పచ్చు. ఆయన అంత యాక్టివ్ గా ఉంటాడు మరి. అయితే తాజాగా సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఫాలోవర్స్ పరంగా మహేష్ ఓ అరుదైన ఫీట్ సాధించారు. మహేష్ బాబు ఫాలోవర్స్ సంఖ్య నిన్నటికి 10 మిలియన్లు దాటింది. అంటే మహేష్ ట్విట్టర్ లో కోటి మంది ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడన్నమాట. దీంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో కోటి మంది ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగిన ఏకైన హీరోగా మహేష్ పేరిట రికార్డు నమోదైంది. మహేష్ కి దగ్గరలో అంత మంది ఫాలోవర్స్ కలిగిన హీరో మరొకరు లేరని చెప్పవచ్చు. సౌత్ విషయానికి వస్తే ట్విట్టర్ ఫాలోవర్స్ పరంగా మహేష్ బాబు తర్వాత కమల్ హాసన్ 6.1 మిలియన్, నాగార్జున 6 మిలియన్, రానా 6 మిలియన్ రజనీకాంత్ 5.7 మిలియన్, అల్లు అర్జున్ 4.7 మిలియన్, జూనియర్ ఎన్టీఆర్ 4.2 మిలియన్, విజయ్ దేవరకొండ 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ చేస్తున్నారు. 

More Related Stories