చిరంజీవికి విలన్ గా జగపతిబాబు

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతి బాబు తర్వాతి రోజుల్లో పవర్ఫుల్ విలన్ గా అవతరించాడు. ఒకపక్క హీరోయిన్, హీరోల తండ్రి పాత్రలు చేస్తూనే టాలీవుడ్ లో స్టైలిస్ట్ విలన్ గా మారాడు. నిజానికి లెజెండ్ సినిమాలో విలన్ గా చేయడం అతని కెరీర్ ని ఊహించని మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆయన విలన్ గా కొన్ని సినిమాలు వచ్చినా లెజెండ్ ఎప్పటికీ ఆయనకు మెమరబుల్. ఆ సినిమా తరువాత ఆయన్ని గట్టిగా వాడుతున్నారు మన తెలుగు దర్శకులు. అయితే ఇప్పుడు ఆయన్ని చిరంజీవి సినిమాలో నటింప చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు చెబుతున్నారు. నిజానికి చిరంజీవి హీరోగా మలయాళంలో వచ్చిన లూసిఫర్ సినిమా తెలుగులో రీమేక్ అవుతోంది. సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా మీద భారే అంచనాలు ఉన్నాయి.
మళయాళంలో మోహన్‌లాల్ పోషించిన పాత్రని ఇక్కడ చిరంజీవి ప్లే చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ఒక నెగటివ్ రోల్ చేశారు. ఆ రోల్ కే ఇప్పుడు జగపతిని రోప్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ క్యారెక్టర్‌కి జోడీ ఉండదు. ఎక్కడా కనీసం హీరోయిన్ ఫోటో కాదు కదా అసలు ఆ ఊసే ఎక్కడా వినిపించదు. పాలిటిక్స్, మాఫియా నేపధ్యంలో సాగే ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ ని పెడుతున్నారని ఒకసారి, అలా లేదని ఒకసారి ప్రచారం జరుగుతూ వస్తోంది. ఆ విషయం మీద క్లారిటీ లేకున్నా ఈ సినిమాలో విజయశాంతి కనిపించే అవకాశం ఉందని, లేదు సుహాసినిని ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుందని ఒకసారి అన్నారు. ఈ విషయాల మీద యూనిట్ క్లారిటీ ఇస్తే కానీ పుకార్లకీ బ్రేక్ పడదు.