English   

ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే పవన్ విరూపాక్ష ఇండస్ట్రీ హిట్టే 

pawan kalyan
2020-07-03 12:28:58

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కాకుండా పవన్ మరో రెండు మూడు సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విరూపాక్ష ఒకటి. ఈ సినిమా పీరియడ్ ఫిలిం అని ప్రచారం జరుగుతోంది. జానపద జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ దొంగగా నటించనున్నాడు. అయితే ఈ సినిమాకి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారని అంటున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ రాకున్నా దాదాపు అది ఖరారు అయినట్టే. 

పవన్, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ఇదే అవనుంది. అయితే క్రిష్‌ దర్శకత్వం వహించిన ‘వేదం’, ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు’ సినిమాలకు కీరవాణి స్వరాలు అందించారు. ఆ పరిచయం కాక ఇది జానపద చిత్రం కావడంతో ఈ సినిమాకి ఆయనను ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు.అయితే ఇక్కడ ఒక సెంటిమెంట్ ను గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. అదేంటంటే మెగా హీరోలకి కీరవాణితో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. కీర‌వాణితో మెగా హీరోలు  మొదటి సారి పనిచేస్తున్నప్పుడు అవన్నీ ఇండస్ట్రీ హిట్స్ వరించాయి. 

మెగాస్టార్ చిరంజీవి, కీరవాణి ఫ‌స్ట్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఘరానా మొగుడు’ అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తరువాత చరణ్‌తో కీరవాణి తొలిసారి కలిసి పనిచేసిన ‘మగధీర’ కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ‘మగధీర’. చిరు, చరణ్‌కి ఫస్ట్ టైమ్‌ కాంబినేషన్ పరంగా అచ్చొచ్చిన కీరవాణి పవన్ కళ్యాణ్‌కి కూడా సెంటిమెంట్ పరంగా కలిసొచ్చి ‘ఇండస్ట్రీ హిట్’ హిస్ట‌రీని కంటిన్యూ చేస్తాడేని పవన్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. 

More Related Stories