English   

చైతూ దిల్ రాజులతో ధాంక్యూ ఫిక్స్ అంటున్న విక్రమ్ కుమార్

Vikram Kumar
2020-07-03 12:54:43

మజిలీ సినిమాతో చానాళ్ళ తరువాత సూపర్ హిట్ కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నారు. శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా దెబ్బ గట్టిగా ఉన్నా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా తమ షూట్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కాబట్టి ఆపక తప్పని పరిస్థితి. అయితే ఆ విషయం ఎలా ఉన్నా ఇప్పుడు నాగచైతన్య తదుపరి ప్రాజెక్ట్ అంటూ ఒక సినిమా మీద చర్చ జరుగుతోంది. ఇప్పటికే మనోడు బంగార్రాజు అనే సినిమా చేస్తున్నాడు, నాగార్జున లీడ్ రోల్ లో నటించే ఈ సినిమాలో ఈయన కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పరశురామ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. 

ఇక ఇప్పుడు మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో ఒక సినిమా ప్లాన్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ విషయం మీద క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా చేస్తున్నట్టు దర్శకుడు విక్రమ్ క్లారిటీ ఇచ్చారు. థాంక్యూ పేరిట ఒక సినిమా చైతూతో ప్లాన్ చేశామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుందన్న వార్త నిజం కాదని, ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఎవరైనా ఏ చిన్న సాయం చేసినా దానికి కృతజ్ఞత వ్యక్తం చేయడమన్నది మనిషి కనీస కర్తవ్యం’ అని నమ్మే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథతో ఈ ‘థాంక్యూ’ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. ఈ విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నారు. 

More Related Stories