గర్భవతి అంటూ ప్రచారం..నిత్య క్లారిటీ

ఈ మధ్య కాలంలో నటించడం తెలిసిన చాలా కొద్ది మంది హీరోయిన్ లలో నిత్యా మీనన్ ఒకరు. మళయాళీ భామ అయిన కూడా తాను ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాష నేర్చుకొని తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం నిత్యా గొప్పతన అనే చెప్పాలి. అభినవ సౌందర్య అనిపించుకునే ఈమె నటన పరంగా కాక ఎంత సేపూ ఎక్స్ పోజింగ్ మీద దృష్టి పెడుతున్న హీరోయిన్ లు ఉన్న ఈ రోజుల్లో మంచి పేరు తెచ్చుకుంది. అయితే నిత్య మీద మొదటి నుంచీ విపరీతమైన రూమర్లు నడుస్తున్నాయి. అందుకేనేమో ఆమెకు ఆఫర్లు డల్ అయ్యాయి. నిత్యామీనన్ సినిమాలకు గుడ్ బై చెప్పిందంటూ ప్రచారం ఎక్కువగా జరిగగా ఏకంగా ఆమె పెళ్లి చేసుకుందనే వార్తలు వచ్చాయి. అక్కడితో అయితే అందరు హీరోయిన్స్ కు వచ్చేవే అయితే ఈమె ఏకంగా ప్రెగ్నెంట్ అని అందుకే ఆమె సినిమాలకు దూరంగా ఉంటుందనే వాదన కూడా ఎక్కువగా వినిపించింది.
తాజాగా బ్రీత్ 2 అనే సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కాబోతున్న సందర్బంగా ఆమె ప్రమోషన్స్ సందర్భంగా ఈ విషయాల మీద స్పందించింది. అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదన్న నిత్య, జనానికు ఎదుటి వారి వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు ఇంత ఆసక్తి ఉంటుందంటూ ప్రశ్నించింది. మీడియా రంగంలోని కొందరు వారే పుకార్లు పుట్టించి వారి రేటింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. కొన్ని కారణాల వల్ల చిన్న గ్యాప్ వచ్చిన మాట నిజమే కాని అది మీరు అనుకున్నట్లుగా మాత్రం కాదని చెప్పుకొచ్చింది.