English   

ఓటీటీ రిలీజ్...భానుమ‌తి రామ‌కృష్ణ‌ రివ్యూ

 Bhanumathi Ramakrishna
2020-07-03 23:53:33

కథ:

మూప్పై మూడు ఏళ్లు వచ్చిన సోంత ఊరు దాటి బయటకి రాని రామకృష్ణ(నవీన్ చంద్ర)..మూప్పై ఏళ్ళు వచ్చి బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయి ఫ్రస్ట్రేషన్ డీల్ చేస్తున్న భానుమతి దగ్గర అసిస్టేంట్ గా జాబ్ జాయిన్ అవుతాడు.  మూప్పై మూడు ఏళ్లు వచ్చినా, పెళ్లి కానీ రామకృష్ణకి ఇంగ్లీష్ కూడా రాదు.  దీంతో ఆపీస్ వర్క్ లో రామకృష్ణ మీద చీరాకు చూపిస్తూ ఉంటుంది భానుమతి.

ఈ టైమ్ లో రామకృష్ణ మంచితనం, అమాయకత్వం భానుమతికి నచ్చుతాయి. అలాగే భానుమతి మెండితనం, ఏదైనా బయటకి మాట్లాడేతత్వం రామకృష్ణ ఇష్టపడతాడు.  ఇద్ద‌రూ ద‌గ్గ‌ర‌వుతున్న త‌రుణంలో అనేక సందేహాలు, అపోహలు అడ్డుపడతాయి..వాటిని దాటుకోని వారిద్దరూ ఎలా ఒక్క‌ట‌య్యారు అనేదే క‌థ‌.

సినిమా ఎలా ఉంది:

కథని బట్టి చూస్తే ఇదోక సింపుల్ ప్రేమ కథ. దర్శకుడు కూడా కథను అలాగే ముందుకు నడిపించాడు. ఈ చిత్రంలో ప్రత్యేకించి కాన్‌ఫ్లిక్ట్ అంటూ లేదు. మెచ్యూరిటీ లెవల్స్ ఉన్న జంట ఎంత కామ్ గా, త‌మ హ‌ద్దుల్లో ఎలా ఉండ‌గ‌ల‌రో  చ‌క్క‌గా ఆవిష్క‌రించాడు ద‌ర్శ‌కుడు. అమ్మాయిల మ‌న‌స‌త్వాన్ని, అబ్బాయిల ఆలోచ‌నా విధానాన్ని వెండి తెర‌పై ఆవిష్క‌రించ‌గ‌లిగాడు.  అలాగే భానుమతి  రామ‌కృష్ణ మ‌ధ్య ఎమోష‌న్ ని  ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా చూపించ‌గ‌లిగాడు.

నవీన్ చంద్ర రామకృష్ణ పాత్రలో అద్భుతంగా నటించాడు. కథ భానుమతి పాయింటాఫ్ వ్యూలో నడుస్తున్న ..తన నటనతో రామకృష్ణ పాత్రను నిలబెట్టాడు. ఇక భానుమ‌తి పాత్రలో సలోని లూత్రా ఆకట్టుకుంటుంది.  ఆమెకి  డబ్బింగ్ చెప్పిన వాయిస్ సినిమాకి చాలా ప్లస్ అయింది.  ట్రైలర్ లో చూసినట్టుగానే.. హర్ష కామెడీ  టైమింగ్ తో సినిమాలో  నవ్వులు పూయించాడు.  దర్శకుడు స్క్రిప్ట్, డైలాగ్స్ పరంగా తగినంత కేర్ తీసుకున్నారు. ఈ చిత్రానికి మాటలు హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్ర నిడివి చూస్తే థియేటర్ కంటే ఓటీటీ రిలీజ్ బెస్ట్ అనిపిస్తుంది. 

ఫైనల్:

ఓవరాల్ గా రామకృష్ణ. భానుమతిల మెచ్యూర్డ్ లవ్ స్టోరి  ఓటిటి లలో వచ్చిన తెలుగు సినిమాలలో బెస్ట్ మూవీగా చెప్పవచ్చు. 

More Related Stories