బిగ్బాస్ కంటెస్టెంట్ ..ప్రముఖ నటుడు రవికృష్ణకు కరోనా

లాక్ డౌన్ సడలింపుల తరువాత షూటింగ్ లకు తెలంగాణ ప్రభుత్వం పరిమిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుల్లితెర షూటింగ్ లు ఒక్కసారిగా మెదలుపెట్టారు. దీంతో ప్రముఖ నటీ నటులు కరోనా బారిన పడుతున్నారు. లేటేస్ట్ గా బుల్లితెర ప్రముఖ నటుడు, బిగ్బాస్ రియాల్టీ షో మూడో సీజన్ కంటెస్టెంట్ రవికృష్ణ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రజలికి తెలియజేశాడు.
అయితే వరుసగా బుల్లితెర సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండంతో నిర్మాతలు భయపడుతున్నారు. సీరియల్స్ షూటింగ్ కొనసాగించాలా? వద్దా? అనే సందిగ్దంలో పడ్డారు. రవికృష్ణ కంటే ముందు ప్రభాకర్, హరికృష్ణ, నవ్య స్వామిలు కరోనాబారిన పడిన విషయం తెలిసిందే." తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని..ప్రస్తుతం క్షేమంగానే వున్నానని చెప్పాడు. అయితే తాను పనిచేసిన సీరియల్ కి సంబందించిన నటులు సాంకేతిక నిపుణులకు కరోనా పరీక్షలు జరిపి వారిని ఐసోలేషన్లో ఉంచాలని" రవికృష్ణ కోరాడు.