English   

వెబ్ సీరీస్ లతో బిజీ అవుతున్న మేకర్స్

tollywood
2020-07-04 16:53:22

ఏ రంగమైనా కాలానికి అనుగుణంగా మారాల్సిందే. ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ జనరేషన్ కి తగ్గట్టు కొత్త మార్పులను అందిపుచ్చుకోవాలి. లేకపోతే ఆడియన్స్ తో గ్యాప్ ఏర్పుడుతోంది. మారుతున్న గ్లోబలైజైషన్ తో  సినిమా ఫీల్డ్ కూడా కొత్త పుంత్తలు తొక్కుతోంది. ఒక్కప్పుడు సినిమా కోసం థియేటర్ కి పరుగులు తీసిన ప్రేక్షకులు ఇప్పుడు కూర్చున్న చోటే సినిమాను ఆస్వాధిస్తున్నారు. టెక్నాలజీ పుణ్యమాని సినిమా నెట్టింట్లో నుండి నట్టింట్లోకి వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే సినిమా అరచేతిలోకి వచ్చేసింది. సినిమాలను సైతం తలదన్నే రితీలో వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి.

దీంతో ఫీల్మ్ మేకర్స్ మారుతున్న ఎంటర్టైన్మెంట్ కి అనుగుణంగా సరికొత్త ఆలోచనలతో ఆడియన్స్ కి గాలం వేస్తున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే థియేటర్స్-సినిమా కంటే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ దే పై చేయి అయ్యే చాన్స్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమా థియేటర్ లో ఉండగానే టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్స్ లో చూసే అవకాశం కల్పిస్తు ఓటీటీలు ఆడియన్స్ ని టెంప్ట్ చేస్తున్నాయి. టాక్ బాగుండి థియేటర్స్ లో ఆడని సినిమాలకు ఓటీటీ లాభాలను తెచ్చిపెడుతోంది. చిన్న సినిమాల నిర్మాతలకు ఈ డిజిటల్ ప్లాట్ ఫాం ధైర్యం ఇస్తోందని చెప్పొచ్చు.అందుకే మన మేకర్స్ కూడా డిజిటల్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. సినిమాల విషయంలో ఎంతలా పెటు తెచ్చుకున్నారో డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనూ అలాగే సిరీస్ లు చేస్తూ మెరుస్తున్నారు డైరెక్టర్స్. 

వెబ్ సీరీసులతో బిజీ అవుతున్న మేకర్స్ ఎవరనేది చూస్తె మొన్న సంక్రాంతికి మహేష్ తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి వెబ్ సీరీస్ డైరెక్ట్ చేయబోతున్నట్టు చెబుతున్నారు. మరో పక్క గుణశేఖర్ కూడా స్వీయ నిర్మాణంలో వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే శివగామి స్టోరీతో దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు వెబ్ సీరీస్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే జీ5 కోసం తరుణ్ భాస్కర్ బీటెక్ వెబ్ సీరీస్ తీసిన అనుభవం ఉంది. అలానే ఆహా కోసం 'మస్తీస్' వెబ్ సీరీస్ నిర్మించాడు క్రిష్. నందినీ రెడ్డీ కూడా గ్యాంగ్ స్టార్స్ వెబ్ సీరీస్ తీసి మంచి పేరే తెచ్చుకుంది.  

More Related Stories