తరుణ్ భాస్కర్ పొగిడిన మళయాళ సినిమా హక్కులు కొన్న సితార

తెలుగులో వేరే బాషల సినిమాలు రీమేక్ చేయడం కొత్త ఏమీ కాదు. ఇక టాలీవుడ్ లో అయితే ప్రస్తుతం రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ సినిమాలన్నీ దాదాపు హిట్ లు కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో హిట్ లేని వారు అంతా అదే బాట పడుతున్నారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటంతో ఈ రెండూ కలిసి ఉన్న సినిమా చేయడానికి కూడా హీరోలు సిద్ధమైపోతున్నారు. మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే సినిమాను రీమేక్ చేయడం కోసం సితార ఎంటర్టైన్మెంట్ కోసం నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మలయాళంలో అగ్ర హీరో అయిన పృథ్వీరాజ్ నటించిన ఈ సినిమాను తెలుగులో రానా, రవితేజలను హీరోలుగా పెట్టి నిర్మిస్తోంది సితార సంస్థ. అయితే మార్చి నెలలో మలయాళం విడుదలైన 'కప్పేల' సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి సినిమా అంటూ ప్రశంసలు లభిస్తున్నాయి. దీంతో ఈ సినిమాని కూడా తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ఇలా మలయాళం సినిమా రైట్స్ కొనడం మూడో సారి. గతంలో ప్రేమమ్, అయ్యప్పనుమ్ కోషియం ఇప్పుడు కప్పేల అనే సినిమా హక్కులు కొన్నారు. ఇక ఈ సినిమా లైన్ చిన్నదే, బడ్జెట్ కూడా పెద్దగా పెట్టనక్కరలేదు. చిన్న లైన్ అయినా అందరినీ ఆకట్టుకునే కధాంశంగా ఈ సినిమా రూపొందింది. మొన్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాని పొగిడి తెలుగు సినిమాని కించపరిచాడనే ఆయన మీద గట్టిగా ట్రోల్స్ నడిచాయి. ఒకవేళ ఆయన చేత ఈ సినిమా చేయిస్తారేమో చూడాలి.