English   

ఆర్ఆర్ఆర్ నిర్మాత జీతాలు ఆపేసారా...

RRR
2020-07-04 20:57:06

తెలుగు ఇండస్టీలో భారీ బడ్జేట్ తో రూపోందుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అరవై శాతం పూర్తయింది.  లాక్ డౌన్ సడలింపు తరువాత ఈ సినిమా షూటింగ్ తిరిగి మెదలుపెట్టాలని దర్శకుడు రాజమౌళి ప్రయత్నాలు చేశారు. 50 మంది యూనిట్ తో కలిసి మాక్ షూట్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.  అయితే సడన్ గా నిర్ణయంపై వెనక్కి తగ్గింది చిత్ర యూనిట్. అప్పటి నుండి ఈ సినిమా షూటింగ్ పై ఎలాంటి సమాచారం లేదు. 

ఇప్పుడు దేశంలో కరోనా ఉదృతీ బాగా పెరగడంతో సినిమా షూటింగ్ లు ఏప్పుడూ మొదలౌవుతాయొ చెప్పాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ యూనిట్ పై ఈ ప్రభావం భారీగా పడినట్టు సమాచారం.  గత కొంత కాలంగా యూనిట్ సభ్యులకి సగం జీతాలు ఇచ్చిన నిర్మాత...ఇక పూర్తి జీతాలు ఇవ్వలేమని చెప్పినట్టు ఫీల్మ్ నగర్ టాక్.  మళ్లీ షూటింగ్ మొదలయ్యే వరకు జీతాలు వుండవని చెప్పినట్లు  తెలుస్తోంది. అయితే యూనిట్ అందరికా...లేకా కొన్ని డిపార్ట్ మెంట్స్ వరికేనా అనేది తెలియాల్సి వుంది.   భారీ బడ్జేట్ చిత్రం కావడం...నిర్మాతకి వడ్డీల భారం పెరిగిపోతుండంతో ఈ నిర్ణయం తీసుకొనివుంటారని ఇండస్ట్రీ వర్గాల  సమాచారం.

More Related Stories