ఆమెజాన్ లోనే విద్యా బాలన్ శకుంతలా దేవి

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు తెరుచుకోవట్లేదు. దీంతో అందరూ ఓటీటీపైనే దృష్టిపెట్టారు. ఇప్పటికే..చాలా సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు మరో బయోపిక్ కూడా రిలీజ్ కాబోతోంది. అదే.. శకుంతలా దేవీ మూవీ. హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'శకుంతలా దేవి', ఇందులో దేవిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించింది. అను మీనన్ దర్శకుడు. వికాస్ మల్హోత్రా ప్రొడ్యూసర్. ఇప్పుడీ చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది.పైగా.. ప్రమోషన్ ప్రోమోను గమ్మత్తుగా డిజైన్ చేసింది. 'శకుంతలా దేవి' చిత్రం జూలై 31న విడుదల అవుతుంది అని గణిత రూపంలో అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది.
శకుంతలాదేవీ అంటే హ్యూమన్ కంప్యూటర్ . కంప్యూటర్ కంటే వేగంగా లెక్కలు కట్టడంలో దిట్ట. ఎదుటి వారు ఎంత క్లిష్టమైన లెక్కల ప్రశ్న వేసినా.. వాళ్లు ఆ ప్రశ్న పూర్తిచేసేలోపే .. జవాబు చేప్పేస్తారు శంకుతలాదేవీ. బయోపిక్ లు చేయడంలో లక్కీ హ్యాండ్ గా పేరుతెచ్చుకున్న విద్యాబాలన్.. శకుంతలా దేవీ సినిమా కోసం గట్టి హోంవర్కే చేసింది. శకుంతలా దేవీ బాడీ లాంగ్వేజ్ , ఆమె వేగంగా మాట్లాడే విధానాల్ని బాగానే వంటబట్టించుకుంది. ఇప్పటికే బాలీవుడ్లో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన సినిమా 'లక్ష్మీబాంబ్' కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఓటీటీ పై స్పందన బాగుందంటున్నారు బాలీవుడ్ వర్గాలు.