English   

ఝాన్సీకి కరోనా ప్రచారం...క్లారిటీ ఇచ్చిన నటి 

 Anchor jhansi
2020-07-05 16:46:59

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. పలువురు సినీ, సీరియల్ సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ ఝాన్సీకి కూడా కరోనా సోకిందనే వార్తలు సోషల్ మీడియాలో కనిపించడంతో ఆమె ఆ విషయం మీద ఫైర్ అయింది. తాజాగా ఝాన్సీ నిర్వహించిన పరివార్ సీజన్ 2 షూటింగ్ సందర్బంగా పాజిటివ్ ఉన్న వారితో కాంటాక్ట్ కావడం వలన ఆమెకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రచారం మొదలయింది. ఈ వార్తల మీద క్లారిటీ ఇచ్చిన ఝాన్సీ.. తాను సేఫ్‌గా ఆరోగ్యంగా ఉన్నానని, తనకు కరోనా పాజిటివ్ అంటూ వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని కొట్టిపారేసింది. నటి నవ్యకు కరోనా పాజిటివ్ అని తెలిసిందో.. అప్పటినుంచే తనకు కాల్స్ వస్తున్నాయని, తనకు కరోనా అంటూ వస్తున్న గాసిప్స్ గురించి మాట్లాడేందుకు మాత్రం ఎవ్వరూ ఫోన్ చేయొద్దని ఆమె కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్స్‌ లో పాల్గొంటున్న అందరూ జాగ్రత్త వహించాలని, సామాజిక దూరం పాటిస్తూనే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని ఝాన్సీ సూచించింది.  

More Related Stories