బాలయ్య సరసన అమలాపాల్..ఈ సారైనా ఫైనల్ చేస్తారా..

బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం మెనార్క్. రీసేంట్ గా బాలయ్య బర్త్ డే సందర్భంగా బోయపాటి విడుదల చేసిన టీజర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో ఇప్పటీ వరకూ బాలయ్య పక్కన హీరోయిన్ ఖరారు కాలేదు. నయనతార, అనుష్క, శ్రీయ ఇలా ఎంతోమంది పేర్లు వినిపించిన ఎవరినీ బోయపాటి టీమ్ ఫైనల్ చేయలేదు.
లేటేస్ట్ గా బాలయ్య సరసన నటించే హీరోయిన్ గా అమలాపాల్ పేరు తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త అమ్మాయికి ఛాన్స్ ఇవ్వలని అనుకున్నారు. ఆడిషన్స్ లో బాలయ్యకు సరైన జోడి దోరకకపోవడంతో.. మళ్ళీ పాత హీరోయిన్స్ నే తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ టైమ్ లో అమలాపాల్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. తెలుగులో మంచి సినిమాలే చేసిన అమలాపాల్ కు పేద్దగా గుర్తింపు దక్కలేదు. మరోవైపు ఈ మూవీ కొంతభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకొని కరోనా కారణంగా వాయిదాపడింది. అతిత్వరలో తిరిగి సెట్స్ మీదకు రావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.