వెంకటేష్ పెద్ద కొడుకు వచ్చాడు

2020-07-06 15:58:06
తమిళ హీరో ధనుష్ నటించిన అసురన్ రీమేక్ లో విక్టరీ వెంకటేష్ నటీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన వెంకటేష్ నారప్ప, ప్రియమణి 'సుందరమ్మ' లుక్స్ సినిమాపై భారీ ఆసక్తిని రేకెత్తించాయి. లేటెస్టుగా నారప్ప పెద్ద కొడుకు మునికన్నా పాత్రను పరిచయం చేసింది చిత్ర యూనిట్. ఈ పాత్రలో కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం నటిస్తున్నారు. ఆదివారం అతని పుట్టినరోజు సందర్భంగా మునికన్నా లుక్ విడుదల చేశారు. సైకిల్ తొక్కుతూ డిఫెరెంట్ గెటప్ లో కార్తీక్ కనిపిస్తున్నాడు. కార్తిక్ లుక్ చిత్రంపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సురేష్ బాబు మరియు కలైపులి ఎస్.థాను వి క్రియేషన్స్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.