ప్రముఖ నటి ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్

2020-07-07 01:42:54
భారతదేశంలో కరోనా విజృంభణ కోనసాగుతూనే ఉంది. ఈ మహామ్మారి బారిన ఇప్పటికే ఎంతో మంది డాక్టర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రీటీలు, సామాన్య ప్రజలు క్రీడాకారులు, పడ్డారు. వీరిలో అధికశాతం మంది కోలుకోగా..కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. లేటేస్ట్ గా ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా సోకింది. కరోనా సమయంలో తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సుమలత సందర్శించారు. ఈ క్రమంలోనే శనివారం ఆమెకు తలనొప్పి, గొంతు నొప్పి రావడంతో.. కరోనా పరీక్షలు చేయగా.. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్లోనే చికిత్స తీసుకుంటున్నారు.