సుశాంత్ సింగ్ రాజ్ పుత్ దిల్ బెచారా ట్రైలర్ టాక్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా ‘దిల్ బెచారా’ చూసేందుకు మూవీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జులై 24న డిస్నీ+హాట్స్టార్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్ర ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో సుశాంత్ ను చూసిన ప్రతి ఒక్కరికి లాస్ట్ టైమ్ చూస్తున్నామన్న భాధ కలుగుతోంది. `ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్` అనే ఓ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం దిల్ బెచారా .
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. కాన్సర్ ని జయించి కాలు పోగోట్టుకున్న అబ్బాయి...కాన్సర్ తో భాదపడతూ జీవించాలనుకుంటున్న అమ్మాయి మధ్య సాగిన ప్రేమకథే ‘దిల్ బెచారా’ . సుశాంత్, సంజనా సంఘి మధ్య ప్రేమ, బావోద్వేగ సన్నివేశాలతో సాగే ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సుశాంత్ జీవితం గురించి చేప్పే డైలాగ్ లు కంటతడి పెట్టిస్తాయి. అలాగే లీడ్ పేయిర్ మధ్య కేమిస్ట్రీ.. ఎ ఆర్ రెహమాన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా చెప్పవచ్చు.