సుమలతకు కరోనా పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు..

సీనియర్ నటి సుమలతకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో అభిమానులు చాలా కంగారు పడుతున్నారు. తెలుగు, తమిళంతో పాటు సౌత్ లో చాలా సినిమాలు చేసింది ఈమె. ఇప్పుడు ఈమెకు కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన పడుతున్నారు అబిమానులు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరినీ ఇప్పుడు కరోనా కలవరపెడుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సుమలతకు కూడా ఇది వచ్చింది. దాంతో అంతా కంగారు పడుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. రెండు రోజులుగా ఆమెకు తలనొప్పి, గొంతు నొప్పి రావడంతో అనుమానం వచ్చి కరోనా టెస్టులు నిర్వహించారు. రెండు రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది. అందులో ఆమెకు కరోనా పాజిటివ్ అని వచ్చింది.
డాక్టర్ సలహాతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటుంది. అందరి ఆశీర్వాదంతో త్వరలోనే ఈమె కోలుకుంటుందని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. మిగిలిన వాళ్లు కూడా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది సుమలత. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఏ అనుమానం వచ్చినా కూడా వెంటనే వెళ్లమని చెప్తుంది ఈమె. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. జేడీఎస్ అభ్యర్థి, దేవెగౌడ మనవడు నిఖిల్‌పై గెలిచి, పార్లమెంట్లో అడుగు పెట్టింది సుమలత.