English   

కరోనాను ఇలా కంట్రోల్ చేయమంటున్న వినాయక్..

Vinayak
2020-07-07 08:35:18

మాస్ దర్శకుడు వినాయక్ సినిమాలకు దూరమైనా కూడా అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉన్నాడు. ఆ మధ్య హీరోగా కూడా ఓ సినిమా చేసాడు వినాయక్. సీనయ్య పేరుతో వచ్చిన ఈ చిత్రం పూర్తి కాకుండానే ఆగిపోయింది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి సలహాలు ఇస్తున్నాడు. కరోనాను అరికట్టడానికి ఎశరికి తోచిన సలహాలు వాళ్లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు వినాయక్ కూడా ఇదే చేసాడు. ఈ క్రమంలోనే ఈయన ఓ ఇంజెక్షన్ గురించి మాట్లాడాడు. ఒకవేళ ఈ ఇంజెక్షన్‌తో కోరనాకు ఏమైనా చేయొచ్చేమో చూడమని చెప్తున్నాడు ఈయన. 

గతంలో తను ఒకసారి ఆఫ్రికాలోని కెన్యాకు వెళ్లానని.. అక్కడికి వెళ్లాలంటే కచ్చితంగా ఎల్లో ఫీవర్‌ను నివారించే ఇంజెక్షన్‌ను తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పాడు వినాయక్.  ఎల్లో ఫీవర్ గురించి అక్కడి డాక్టర్‌ను అడిగితే.. ప్రస్తుతం కరోనా లక్షణాలుగా ఏవైతే చెప్తున్నారో అవే ఉన్నాయని చెప్పాడు వినాయక్. అందుకే వైద్యులకు ఓ సారి ఈ ఇంజెక్షన్ కరోనాకు కూడా పని చేస్తుందేమోనని అనుమానం వస్తుందని చెప్పాడు వినాయక్. ఈ మధ్య కరోనా గురించి అద్భుతంగా వివరించిన ఇద్దరు వైద్యులకు తన ఈ సూచన చేరాలనే ఉద్దేశ్యంతోనే తాను వీడియో చేస్తున్నట్లు వివరించాడు వినాయక్. 
 

More Related Stories