బాలయ్య హీరోయిన్.. క్లారిటీ ఇచ్చిన బోయపాటి

బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం మెనార్క్(వర్కింగ్ టైటిల్). మొన్నీమధ్యన బాలయ్య బర్త్ డే సందర్భంగా బోయపాటి విడుదల చేసిన టీజర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాలో ఇప్పటీ వరకూ బాలయ్య పక్కన హీరోయిన్ ఖరారు కాలేదు. నయనతార, అనుష్క, శ్రీయ ఇలా ఎంతోమంది పేర్లు వినిపించిన ఎవరినీ బోయపాటి టీమ్ ఫైనల్ చేయలేదు.
లేటేస్ట్ గా బాలయ్య సరసన నటించే హీరోయిన్ అంటూ అమలాపాల్ పేరు తెర మీదకి వచ్చింది. అయితే తాజాగా ఈ విషయంపై దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకి ముందే ఎస్టాబ్లిష్ అయిన హీరోయిన్ కాకుండా కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని బోయపాటి ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో బాలయ్య సినిమా ద్వారా ఓ కొత్త ఫేస్ పరిశ్రమకు పరిచయం కాబోతుందన్న మాట. ఈ క్రమంలో బాలయ్య పక్కన ఛాన్స్ కొట్టేసే ఆ లక్కీ హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ మూవీ కొంతభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకొని కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలో తిరిగి సెట్స్ మీదకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.