English   

ప్రభాస్ అభిమానులకు ఊహించని గిఫ్ట్.. బాహుబలి విడుదలైన రోజే..

Prabhas20
2020-07-08 16:09:19

బాహుబలి, సాహో లాంటి సినిమాల తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈయన అభిమానులు ఇప్పుడు దేశమంతా ఉన్నారు. బాహుబలి తర్వాత విడుదలైన సాహో తెలుగులో నిరాశపరిచినా హిందీలో మాత్రం సంచలన విజయం సాధించింది. దాంతో ఇప్పుడు ప్రభాస్ అంటే నేషనల్ వైడ్ పాపులారిటీ వచ్చేసింది. ఆయన సినిమాల కోసం కూడా అలాగే వేచి చూస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాధాకృష్ణ కుమార్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల తేది కన్ఫర్మ్ చేశారు నిర్మాతలు. ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు అనుకోని గిఫ్ట్ ఇచ్చాడు ప్రభాస్. జూలై 10న ఉదయం 10 గంటలకు 'ప్రభాస్ 20' ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

తెలుగుతో పాటు హిందీ తమిళ్ మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ లో వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి మొదలుపెట్టారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. బాహుబలి విడుదలై జులై 10, 2020 కి సరిగ్గా అయిదేళ్లు పూర్తవుతుంది. అదే రోజు తన కొత్త సినిమా అప్డేట్ కూడా ఇస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. సరిగ్గా ఐదేళ్ల కింద 2015 జూలై 10న బాహుబలి తొలి భాగం విడుదలైంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ కొనసాగిస్తూ కొత్త సినిమా ముచ్చట్లు అదే రోజు చెప్పబోతున్నాడు ప్రభాస్. ఏదేమైనా కూడా అనుకోకుండా వచ్చిన అప్డేట్ తో పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్ సొంత బ్యానర్ గోపికృష్ణ మూవీస్ తో కలిసి యూవీ క్రియేషన్స్ 130 కోట్లతో ఈ సినిమాని నిర్మిస్తుంది.  

More Related Stories