English   

విస్కీ బాటిల్ తీసుకుని ఇంటికొచ్చాడు.. దర్శకుడిపై హీరోయిన్ ఫైర్..

Anu Aggarwal
2020-07-08 17:06:40

సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కచ్చితంగా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎదుర్కోవాల్సిందే అంటున్నారు కొందరు హీరోయిన్లు. ఇక్కడ ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఏమీ ఆశించకుండా కేవలం ఫ్యాషన్ తో పని చేస్తుంటారు. కానీ చాలా మంది దర్శక నిర్మాతలు అమ్మాయిల నుంచి పడక సుఖం కోరుకుంటారని కొందరు బాహాటంగానే చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అను అగర్వాల్ కూడా సంచలన ఆరోపణలు చేసింది. 90ల్లో ఈమె ఆషీకీ సినిమాతో కుర్రాళ్ళ మనసులు కొల్లగొట్టింది. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. అప్పటి పరిస్థితులను తనకు ఎదురైన అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో మీడియాతో పంచుకుంది అను అగర్వాల్. 

పేర్లు చెప్పకపోయినా.. ఒక బాలీవుడ్ టాప్ డైరెక్టర్ మధ్యాహ్నం వేళ విస్కీ బాటిళ్లతో తన ఇంటికి వచ్చాడని ఆమె తెలిపింది. పైకి చెప్పకపోయినా తన ఉద్దేశం అప్పటికే తనకు అర్థం అయిపోయిందని.. ఆయన ఉద్దేశం అర్థం చేసుకొని మర్యాదగా ఇంటి నుంచి వెళ్ళిపొమ్మని కోరినట్లు చెప్పింది అగర్వాల్. అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండడమే మంచిదని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పింది ఈ హీరోయిన్. ఇక్కడ ఎవరు ఎవరిని బలవంతపెట్టారు.. మన మనస్సాక్షి సరిగ్గా ఉంటే చాలు అంటుంది అను అగర్వాల్. తన కెరీర్లో తాను ఇదే ఫాలో అయ్యానని చెప్పుకొచ్చింది ఈ సీనియర్ హీరోయిన్. కానీ ఒకటి మాత్రం నిజం.. కొందరు దర్శక నిర్మాతలు హీరోలు మాత్రం ఖచ్చితంగా హీరోయిన్లను ఇబ్బంది పెట్టడానికి ఉంటారు అని కుండబద్దలు కొట్టింది ఈ ముద్దుగుమ్మ. 

More Related Stories