సీనియర్ నటి జయంతికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్ పై చికిత్స..

సీనియర్ నటి జయంతి శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె ఆస్తమాతో భాధపడుతున్నట్లు సమాచారం. వయసు మీద పడుతుండటంతో అనారోగ్య సమస్య ఎక్కువైనట్టు చెబుతున్నారు. నటి జయంతి జనవరి 6 1945లో జన్మించింది. 1960లలో ఆమె నటిగా కెరీర్ ఆరంభించారు. అన్ని భాషల్లోనూ కలిపి ఆమె సుమారు 500లకు పైగా సినిమాల్లో నటించారు.
ఈమె కేవలం తెలుగు, కన్నడ చిత్రాలకే పరిమితం కాలేదు. తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కర్ణాటక ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా ఏడు అవార్డులను అందుకుంది. అంతేకాదు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు రాష్ట్రపతి అవార్డు అందుకుంది. ఈమె అప్పటి అగ్రనటులు సరసన హీరోయిన్ గా నటించి మరింత ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.