సొంత బ్యానర్స్ నే లైన్ లో పెడుతున్న టాలీవుడ్ స్టార్స్

మిగతా వాళ్ళతో పోలిస్తే మన తెలుగు వాళ్ళకి కాస్త వ్యాపార ద్రుష్టి ఎక్కువే. అందుకే కాస్త సంపాదించగానే ఆ వచ్చిన దానిని ఊరికే బ్యాంకుల్లో దాచకుండా ఏదో ఒక వ్యాపారం మీద పెడుతుంటారు. అయితే ఈ విషయం మామూలు వారికే కాదు సినిమా వాళ్ళకి కూడా వర్తిస్తుంది. మన టాలీవుడ్ వాళ్ళు ఇదివరకు తమ సంపాదనలతో రియల్ ఎస్టేట్, హోటల్స్ లాంటి వాటి మీద పెట్టుబడి పెట్టె వారు కానీ ఇప్పుడు అలా కాకుండా ప్రొడక్షన్ హౌస్ లు పెట్టేస్తున్నారు. దానికి కారణం ఈ బిజినెస్ అయితే తమకు అన్ని లోటుపాట్లు తెలిసి ఉండడమే. అందుకే స్టార్స్ అందరూ సొంత బ్యానర్స్ నే నమ్ముకుంటున్నారు. అందుకు మరో కారణం కూడా ఉంది, అదేటంటే బైట బ్యానర్స్ లో నటిస్తే 30 నుంచి 40 కోట్లు పారితోషికం వస్తుంది. కానీ అదే ఓన్ బ్యానర్స్ లో నటిస్తే డబుల్ ఆదాయం వస్తుంది. అందుకే దాదాపుగా స్టార్స్ అందరూ సొంత బ్యానర్స్ ఏర్పరచుకున్నారు. మన టాలీవుడ్ స్టార్స్ లో ఎవరెవరికి నిర్మాణ సంస్థలు ఉన్నాయో చూద్దాం.
మహేశ్‌బాబు :
తన పేరు మీద బేనర్ స్థాపించిన మహేశ్‌బాబు శ్రీమంతుడుతో నిర్మాతగా టర్న్ అయ్యాడు. అప్పటి నుండి దాదాపు ప్రతి సినిమాలోనూ నిర్మాణ భాగస్వామ్యం తీసుకుంటున్నాడు. అలా సరిలేరునీకెవ్వరు నాన్ థియేటరికల్ రైట్స్ మహేశ్ సొంతం చేసుకున్నాడు. ఆ నాన్ థియేటరికల్ రైట్స్ అంటే శాటిలైట్.. డిజిటల్.. డబ్బింగ్ రైట్స్ ఏకంగా 50 కోట్లు తెచ్చి పెట్టాయి.
ప్రభాస్ :
ఇక ప్రభాస్ కి కూడా సొంత బ్యానర్ ఉంది. అదే యువి క్రియేషన్స్. ఈ యువి బేనర్ లోనే వరుసగా సాహో... రాధే శ్యాం సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా అయ్యాక ఇదే బ్యానర్లో బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రభాస్ పనిచేయనున్నాడు.
పవన్ కల్యాణ్ :
ఈయన తన బ్యానర్ లో ఒక్క సినిమానే చేశాడు. అదే సర్దార్ గబ్బర్ సింగ్. పవన్ బేనర్ పేరు పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్.
ఎన్టీఆర్ :
ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ అంటే తన అన్న కళ్యాణ్ రామ్ దే అయినా సొంతది అన్నట్టే, ఈ బ్యానర్ లోనే జైలవకుశ చేశారు, ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాని, హాసిని హారిక క్రియేషన్స్‌తోపాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా నిర్మాణం చేయనుంది.