English   

బాలయ్య విలన్ ఆయనేనా 

balayya
2020-07-09 20:09:51

నంద‌మూరి బాల‌కృష్ణ ప్రస్తుతం బోయ‌పాటితో క‌లిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ సినిమా మీద భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే బోయ‌పాటి తాజా ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆస‌క్తిక‌ర వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకో నిజం ఎంతుందో తెలియదు కానీ ఈ సినిమా గురించిన కొన్ని పుకార్లు భీబత్సంగా హల్చల్ చేస్తున్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాల్లో హీరో ఎంత బలంగా ఉంటాడో.. విలన్ కూడా అంతే బలంగా, పొగరుగా ఉంటాడు. అందుకే, ఆయన సినిమాల్లో హీరో పాత్రలు బాగా ఎలివేట్ అవుతాయి. ఈ బాల‌కృష్ణ సినిమా ద్వారా బాలీవుడ్ హీరోను బోయపాటి విలన్‌గా పరిచయం చేయబోతున్నారని అంటున్నారు. 

ఆ బాలీవుడ్ హీరో ఎవరో కాదు సంజయ్ దత్. బాల‌య్య‌కి విల‌న్‌గా బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్‌ని ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఆయ‌న‌తో సంప్ర‌దింపులు కూడా మొద‌లు పెట్టార‌నేది టాక్. ప్రస్తుతం ఈయన యశ్‌ హీరోగా వస్తున్న ‘కేజీఎఫ్:‌ చాఫ్టర్‌ 2’ చిత్రంలో అధీర అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.  

More Related Stories