English   

సర్కారు వారి పాట లైన్ ఇదే 

Mahesh
2020-07-09 20:21:04

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశు రామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది కూడా. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించనుందని వార్తలు వస్తున్నా ఆ విషయం మీద అయితే క్లారిటీ లేదు. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించే పాత్ర ఇదేనంటూ ఒక ప్రచారం గట్టిగా జరుగుతోంది. అదేంటంటే ఈ సినిమాలో కీర్తి బ్యాంక్‌ ఉద్యోగిగా కనిపించనుందని సమాచారం. 

ఇక మహేష్‌ బాబు తల్లి బ్యాంకు అధికారిగా పనిచేస్తుందట. ఆమె కింద బ్యాంకు ఉద్యోగిగా కీర్తి సురేష్‌ నటించనుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా లైన్ ఏంటంటే ? హైదరాబాద్‌ లోని ఓ బ్యాంకులో డబ్బు ఎగ్గొట్టి ఓ వ్యక్తి దేశం విడిచి వెళ్తాడట. ఈ విషయంలో బ్యాంకు అధికారులను బలి చేసే ప్రయత్నంలో తన తల్లిని మహేష్‌ ఏలా కాపాడుకొన్నాడనేదే కథ అని అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు. ఇక చెప్పిన లైన్ కి టైటిల్ కూడా సరిపోతోంది. ఎందుకంటే అలా డబ్బు ఎగ్గొట్టి వెళ్ళినప్పుడే ప్రభుత్వాలు లేదా బ్యాంకులు వేలం వేస్తాయి. ఆ వేలం వేసే ముందు మొదలు పెట్టే వాడే పదమే సర్కారు వారి పాట.

More Related Stories