English   

బన్నీ పక్క హీరోయిన్ గా ఛాన్స్ అంటూ వల..గీతా కేసు 

geetha arts
2020-07-10 10:50:04

గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిలకు వల వేస్తున్నట్టు గుర్తించింది సదరు నిర్మాణ సంస్థ. హీరో అల్లు అర్జున్ పక్కన తమిళ్ సినిమాలో హీరోయిన్ అవకాశం కల్పిస్తానంటూ అమ్మాయిలకు వల విసురుతున్నట్టుగా తేలింది. గీతా ఆర్ట్స్ లో  డిజైనర్, మేకప్ మెన్ అని చెప్పుకుంటూ.. అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నట్టు సంస్థ దృష్టికి రావడంతో తమ బ్యానర్ పేరు చెప్పి అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు గీతా ఆర్ట్స్ మేనేజర్ సత్య కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

నటన మీద మక్కువతో, వెండితెరపై కనిపించాలనే కోరికతో ఎంతో మంది అమ్మాయిలు ఇలాంటి వారినే నమ్మి మోసపోతున్నారు. తాను తీయబోయే మల్టీస్టారర్ సినిమాలో రెండో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని చెప్పి తన పేరిట ఒక నెంబర్ నుంచి కొంత మంది అమ్మాయిలకు కాల్స్ వెళ్లాయని ఇటీవల దర్శకుడు అజయ్ భూపతి కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనే గీతా ఆర్ట్స్ ది కూడా.

More Related Stories