English   

ప్రేమనగర్ సినిమా వెనుక కధ..కారు చేజారిన అదృష్టం 

Prem Nagar
2020-07-10 11:21:36

అక్కినేని నాగేశ్వరరావు ప్రేమనగర్ సినిమా గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. నాగేశ్వరరావు జంటగా వాణిశ్రీ నటించిన ఈ సినిమా ఆరోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్. అప్పటి టాప్ ప్రొడ్యూసర్ రామానాయుడు నిర్మించిన ఈ సినిమా ఆయనకి మరపురాని సినిమా. అంతలా మలుపు తిప్పిన ఈ సినిమా దృశ్య కావ్యంగా మలవడానికి చాలా పెద్ద కధే ఉంది. అదేంటంటే కోడూరి కౌసల్యాదేవి రచించిన ప్రేమనగర్ నవల ఆధారంగా సినిమా తీయాలని ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి భావించి, వెంటనే హక్కులు కొనేసి అక్కినేనిని సంప్రదించారట. అక్కినేని అన్నపూర్ణ గారు కూడా ఈ నవల చదివి కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని అక్కినేనికి చెప్పడంతో ఆయన సినిమాకు ఒకే చెప్పేసారు. 

అలా ఆయన హీరోగా కె ఆర్ విజయ హీరోయిన్ గా సినిమా మొదలు కావలసి ఉంది. కానీ శ్రీధర్ రెడ్డి కారుకి ఆక్సిడెంట్ అవ్వడంతో ఈ సినిమా ఆపేయాలని శ్రీధర్ రెడ్డి భార్య కోరడంతో అటక ఎక్కేసింది. అయితే కధ మీద నమ్మకంతో ఈ సినిమా తీస్తే బాగుటుందని అక్కినేని చెప్పడంతో రామానాయుడు వెంటనే 60వేలు పెట్టి శ్రీధర్ నుండు కధ కొనేశారట. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి హీరోయిన్ గా వాణిశ్రీ ని సెలెక్ట్ చేసి కె ఎస్ ప్రకాశరావు డైరెక్షన్ లో సినిమా చేశారు. 15లక్షలతో అంటే ఆరోజుల్ల్లో భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఏకంగా 50 లక్షలు వసూళ్లు రాబట్టింది. శ్రీధర్ రెడ్డి కారు దెబ్బకు ఈ సినిమా ఆయన చేజారి రామానాయుడుకు వరంగా మారిది.  

More Related Stories