పవన్ ని ఫ్లవర్ స్టార్ అంటూ..

పవన్ కి టీవీ9కి మధ్య కొన్నాళ్ళు పెద్ద యుద్ధమే నడిచింది. ఆ సమయంలో ఆయనకి ఛానెల్ కు పెద్దగా పడేది కాదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ నా తల్లిని తిట్టారు అంటూ, మూడు రోజులు తరువాత బయటకు వచ్చి కొన్ని ఛానెల్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించాడు కూడా. ఆ తరువాత క్రమంలో అంతా కామన్ అయిపోయింది. బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన పవనే ఆ ఛానల్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. అంతా సెట్ అయిపొయింది అనుకున్నారు. అయితే సడన్ గా ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ సోషల్ mediaలో వైరల్ అవుతోంది. ఆ స్క్రీన్ షాట్ లో ఏముందంటే పవన్ కళ్యాణ్ కు సంబందించిన ఒక వార్తను టీవీ9 కవర్ చేసింది. హెడ్ లైన్స్ లో భాగంగా పవర్ స్టార్ భరోసా అని రాయబోయి ప్లవర్ స్టార్ భరోసా అని రాశారు. అయితే అది పొరపాటున వచ్చిందా లేక కావాలని ఎవరైనా ఎడిట్ చేశారా అనేది తేలాల్సి ఉంది. దీంతో ఆయన అభిమానులు టీవీ9 మీద విమర్శల దాడి కురిపిస్తుండగా కొందరు ఏమో ఎంత ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం పబ్లిక్ గా ఇలా అనేస్తారా ? అంటూ కామెంట్ చేస్తున్నారు.