English   

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో బీహార్ కోర్టు సంచలన తీర్పు.. 

Sushant Singh Rajput
2020-07-10 16:56:59

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. అసలు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో కూడా ఊహించలేకపోతున్నారు అభిమానులు. ఈయన చనిపోయి అప్పుడే 24 రోజులు గడిచిపోయింది. అయినా కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు మాత్రం వీడటం లేదు. ఇప్పటికీ ఏదో ఓ ఆసక్తికరమైన మలుపు వస్తూనే ఉంది. మరోవైపు ముంబై పోలీసులు కూడా ఈయన కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పెద్ద హీరో కావడంతో ఆయన మరణాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన రెండు రోజుల తర్వాత బీహార కోర్టులో ఓ కేసు రిజిష్టర్ అయింది. ఆయన చావుకు చాలా మందిని కారణం చేస్తూ బాలీవుడ్ పెద్దలపై కేసు ఫైల్ చేసాడు ఓ లాయర్. కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్ తో పాటు మరో ముగ్గురిపై బీహార్ కోర్టులో కేసు ఫైల్ అయింది. అయితే దీనిపై ఇప్పడు బీహార్ కోర్టు షాక్ ఇచ్చింది. అసలు ఆధారాలు లేకుండా ఉన్న కేసు అంటూ దీన్ని కొట్టి పారేసింది బీహార్ కోర్ట్. మరోవైపు ముంబైలో కూడా పోలీసులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును చాలా విధాలుగా అన్వేషిస్తున్నారు. మరి ఈ కేసులో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 

More Related Stories