కరోనా సమయంలో కొత్త జాబ్ చూసుకున్న రవిబాబు..

కరోనా వైరస్ వచ్చి అందరి జీవితాలను తలకిందులు చేసింది. చాలా మంది పూట గడవక ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు. మరికొందరు ఆకలితో అలమటిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా దీనికి మినహాయింపు కాదు. ఇప్పటికే కొందరు నటులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇదిలా ఉంటే కరోనా పోయేవరకు షూటింగ్స్ కు కూడా వచ్చేలా లేరు నటీనటులు. దాంతో దర్శక నిర్మాతలు మరో పని చూసుకుంటున్నారు. ఇప్పుడు దర్శకుడు, నటుడు రవిబాబు కూడా ఇదే చేసాడు. ఈయన క్రష్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ మొన్నే మొదలుపెట్టి ఆపేసాడు ఈ దర్శకుడు. కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రతరం కావడంతో ఈయన షూటింగ్ జోలికి వెళ్లకపోవడమే మంచిది అనుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే కరోనా వైరస్ తగ్గకపోయినా కూడా తను మరో పని చేసుకుంటానని చెప్తున్నాడు ఈయన. అందులో భాగంగానే టీ మాస్టర్ అవతారం ఎత్తాడు రవిబాబు. ప్రొఫెషనల్ టీ మాష్టర్స్ చేసినట్టుగా చాయ్‌ను అంత ఎత్తునుంచి వడబోసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ దర్శకుడు. తన సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా కొత్తదనం చూపిస్తుంటాడు రవిబాబు. అందులో భాగంగానే ఈయన టీ వీడియో చేసాడు. ఇది కాస్తా ఇప్పుడు వైరల్ అయిపోయింది. ఆ మధ్య ఓ మాల్ కు వెళ్లినపుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ టెంపరేచర్‌ను చెక్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. ఇప్పుడు టీ మాస్టర్ వీడియో కూడా అంతే. ఫ్యూచర్ లో తాను టీ బండి పెట్టుకుంటానని చెప్తున్నాడు ఈయన.