రాధే శ్యామ్ ఫస్ట్ లుక్..మాస్క్ లేదంటూ పోలీసుల ఎంట్రీ

ఎట్టకేలకి ప్రభాస్ అభిమానుల కరువు తీర్చారు యూవీ క్రియేషన్స్ వాళ్ళు. నిన్న ప్రభాస్ 20 సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్ లో ప్రభాస్ పూజాలు కౌగలించుకుని ఉంటారు. దీనిని కరోనా ప్రచారానికి వాడుకున్నారు పోలీసులు, అది కూడా అస్సాం పోలీసులు. ఏంటంటే కరోనా సమయంలో వాళ్లిద్దరూ చాలా దగ్గరగా ఉన్నా కూడా ఎలాంటి మాస్క్ ధరించలేదు. దాంతో రాధే శ్యామ్ సినిమాను తమ కోవిడ్ 19 ప్రచారం కోసం వాడారన్న మాట అస్సాం పోలీసులు. ''మీ ప్రియమైన వారు బయటకు వచ్చినప్పుడల్లా మాస్క్ పెట్టుకోమని చెప్పండి. మేము ప్రభాస్‌కి చెప్పడానికి ప్రయత్నించాం.. కానీ ఆయన స్పందించలేదు. అందుకే ఇలా ఫోటోషాప్ ద్వారా ఎడిట్ చేసి ఈ పోస్టర్ ద్వారా సందేశం పంపుతున్నాం'' అంటూ సరదాగా ట్వీట్ పెట్టారు అస్సాం నాగాన్ పోలీసులు. ఇందులో ఒరిజినల్ పోస్టర్లో కనిపించిన ప్రభాస్- పూజా హెగ్డేలకు మాస్క్‌లు పెట్టేయడం గమనార్హం. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలనే కోణంలో ఇలా వెరైటీ సందేశం అందించిన పోలీసులను మెచ్చుకుంటున్నారు నెటిజన్లు.