English   

పవన్ కళ్యాణ్ సినిమాలో రామ్ చరణ్.. తండ్రితో పాటు బాబాయ్..

Ram Charan
2020-07-11 19:29:08

నేను సినిమాలు చేయడం లేదు మొర్రో.. మరో రాజకీయాలు మాత్రమే చేస్తాను. ఇకపై నాకు సినిమాలకు ఎలాంటి సంబంధం ఉండదు అని పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా అభిమానులు మాత్రం వినిపించుకోలేదు. అందుకే వాళ్ల కోసమే ఇప్పుడు వరస సినిమాలు చేస్తున్నాడు పవన్. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్, హరీష్ శంకర్ సినిమాలకు కూడా కమిటయ్యాడు పవన్. దాంతో పాటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. క్రిష్ ముందు నుంచి కూడా చరణ్ కు మంచి స్నేహితుడు. దానికితోడు పవన్ తో నటించడానికి చరణ్ కూడా చాలా రోజులుగా వేచి చూస్తున్నాడు. మంచి కథ దొరికితే బాబాయ్, నాన్నలతో నటించడానికి సిద్ధమే అని చెప్పాడు రామ్ చరణ్. 

ఇప్పుడు అన్నట్లుగానే చిరంజీవితో కలిసి ఆచార్యలో నటించబోతున్నాడు రామ్ చరణ్. ఇప్పుడు పవన్ సినిమాలో కూడా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో అన్నయ్య కొడుకుతో పవన్ నటించబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలైతే వస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక చిన్న అతిథి పాత్రలో నటిస్తున్నాడని తెలియగానే గాల్లో తేలిపోతున్నారు మెగా అభిమానులు. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇది పూర్తయిన పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాల గురించి ఆలోచించనున్నాడు. నిజంగా ఇది వర్కవుట్ అయితే మాత్రం ఫ్యాన్స్ కు అంతకంటే కావాల్సిందేమీ ఉండదేమో..?  

More Related Stories