English   

అమితాబ్‌తో పాటు అభిషేక్ బచ్చన్‌కు కూడా కరోనా పాజిటివ్..

Amitabh Bachchan Abhishek
2020-07-12 07:28:26

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డాడు. ఆయనతో పాటు తనయుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అంతా ఒకే ఇంట్లో ఉండటంతో తండ్రి నుంచి కొడుకుకు కూడా కరోనా సోకింది. మరోవైపు కుటుంబంలో అంతా టెస్టులు చేయించుకుంటున్నారు. వాళ్ల రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్,  జయా బచ్చన్ తో పాటు అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్, మనవడు అగస్త్య నందా, మనవరాలు నవ్య నివేలి కూడా టెస్టులు చేయించుకున్నారు. వాళ్లలో ఇంకెంతమందికి ఈ కరోనా మహమ్మారి సోకుతుందో అని భయపడుతున్నారంతా. మరోవైపు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా వచ్చిందని తెలియగానే అభిమానులు కంగారు పడుతున్నారు. అమితాబ్ ఇంకా అభిషేక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు క్రికెటర్స్, బాలీవుడ్ నటులు అంతా బచ్చన్ కుటుంబానికి ఏం కాకూడదని.. అంతా బాగుండాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు. 

More Related Stories