ఐశ్వర్యారాయ్, ఆరాధ్య కు కూడా కరోనా పాజిటివ్

కరోనా ఎవరినీ వదలడం లేదు. పెద్ద చిన్నా తేడాలేకుండా అందరినీ సోకుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డాడన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు కూడా. ఇక ఈయనతో పాటు తనయుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అంతా ఒకే ఇంట్లో ఉండటంతో తండ్రి నుంచి కొడుకుకు కూడా కరోనా సోకింది. మరో వైపు కుటుంబంలో అంతా టెస్టులు చేయించుకున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయా బచ్చన్ తో పాటు అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్, మనవడు అగస్త్య నందా, మనవరాలు నవ్య నివేలి కూడా టెస్టులు చేయించుకున్నారు. వాళ్లలో ఇప్పుడు ఐశ్వర్య రాయ్ కు ఆమె కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్ అని తేలింది. అభిషేక్, అమితాబ్ లతో పాటు ఐశ్వర్యకు కూడా కరోనా వచ్చిందని తెలియగానే అభిమానులు కంగారు పడుతున్నారు. అమితాబ్ ఫ్యామిలీ అంతా త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు క్రికెటర్స్, బాలీవుడ్ నటులు అంతా బచ్చన్ కుటుంబానికి ఏం కాకూడదని.. అంతా బాగుండాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు.