బాడీగార్డులకు కోట్లలో జీతాలు ఇస్తున్న బాలీవుడ్ స్టార్స్..

బాడీగార్డ్ అంటే ప్రాణాలకు తెగించి కాపాడే వాడని అర్థం. అంగరక్షకుడు అంటే అనుక్షణం వెంటే ఉండి తన ప్రాణాలు సైతం అడ్డేసి యజమాని ప్రాణాలు కాపాడేవాడు అని అర్థం. అలాంటి బాడీగార్డ్స్ కోసం ఎంత ఖర్చు చేసినా తక్కువే అంటున్నారు బాలీవుడ్ సెలబ్రిటీస్. వాళ్లకోసం పని చేసే వాళ్లకు ఏకంగా కోట్లలో జీతాలు ఇస్తున్నారు.
షారుక్ ఖాన్: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు రవి సింగ్ అనే బాడీగార్డ్ ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా కూడా వెంటే ఉంటాడు. షారుక్‌పై ఈగ వాలనీయకుండా చూసుకునే రవి సింగ్‌కు ఏడాదికి 2.5 కోట్ల జీతం ఇస్తున్నాడు షారుక్ ఖాన్.
అమీర్ ఖాన్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంగరక్షకుడి పేరు యువరాజ్ ఘోర్పడే. ఈయనకు ఏడాదికి 2 కోట్ల జీతం ఇస్తున్నాడు అమీర్ ఖాన్.
సల్మాన్ ఖాన్: కండలవీరుడు బాడీగార్డ్ షెరా చాలా మందికి పరిచయమే. ఎప్పుడూ సల్మాన్ వెన్నంటే ఉంటాడు షెరా. తను నటించిన బాడీగార్డ్ సినిమాను షెరాకు అంకితం ఇచ్చాడు సల్మాన్ ఖాన్. అంతేకాదు ఈయనకు ఏడాదికి దాదాపు 2 కోట్లకు పైగానే చెల్లిస్తున్నాడు సల్మాన్.
అక్షయ్ కుమార్: వరస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే అక్షయ్ కుమార్.. తన బాడీగార్డ్ ష్రెస్ సెయ్ లేకుండా అడుగు కూడా బయటపెట్టడు. ఈయనకు ఏడాదికి 1.2 కోట్ల రూపాయలు జీతంగా ఇస్తున్నాడు అక్షయ్ కుమార్.
దీపిక పదుకొనే: హీరోయిన్లు బయటికి వచ్చినపుడు కచ్చితంగా వాళ్లకు చాలా చుక్కలు కనిపిస్తుంటాయి. అలాంటి వాళ్ల నుంచి బయటపడాలంటే బాడీగార్డ్స్ అనే వాళ్లు బలంగా ఉండాలి. అందుకే దీపిక తన బాడీగార్డ్‌గా తెలిసిన మనిషి జలాల్‌ను నియమించుకుంది. ఈయనకు జీతం ఏడాదికి కోటి.
అమితాబ్ బచ్చన్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బాడీగార్డ్ పేరు జితేంద్ర షిండే. ఈయనకు ఏడాదికి కోటిన్నర చెల్లిస్తున్నాడు బిగ్ బి. ఎక్కడికి వెళ్లినా కూడా వెంటే ఉంటాడు ఈయన.