సీఎం జగన్ కు లేఖ రాసిన బాలయ్య

2020-07-13 17:36:14
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డీ గారికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేఖ రాశారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా థాంక్స్ తెలియజేశారు. అలాగే తన నియోజకవర్గం హిందూపురానికి సంబంధించి సీఎం జగన్ ముందు మరో డిమాండ్ ఉంచారు. త్వరలో జరిగే జిల్లాల విభజనలో తన నియోజకవర్గం హిందూపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హిందూపురాన్ని జిల్లాగా చేస్తే చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని ఆయన లేఖలో తెలిపారు.