English   

పవన్ కళ్యాణ్ ను రాంగోపాల్ వర్మ వదిలేలా లేడుగా..

 RGV
2020-07-14 14:45:48

పట్టుకున్న దయ్యమైనా మంత్రం వేస్తే వదులుతుందేమో.. కానీ వర్మ పట్టుకుంటే మాత్రం అంత ఈజీగా వదలడు. ఇప్పుడు ఇది మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ను మాత్రం ఈజీగా వదిలిపెట్టడం లేదు వర్మ. తన కథ కోసం అతడిపై సెటైరికల్ సినిమా తీస్తున్నాడు. అదేంటి అని అడిగితే నా ఇష్టం అంటున్నాడు. తీసేవాడు తీయక అనవసరంగా అభిమానులను రెచ్చగొడుతున్నాడు. పవర్ స్టార్ సినిమా నుంచి ఒక్కో పోస్టర్ విడుదల అవుతుంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎక్కడ లేని మంట పుడుతుంది. వర్మ కానీ లైవ్ లో దొరికితే కచ్చితంగా చేయి చేసుకుంటారేమో.. అంతగా వాళ్ళ ఈగోను టచ్ చేస్తున్నాడు వర్మ. 

తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు. ఏదో ఒక విషయంలో పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు తిడుతున్నాడు. అలాంటి పోస్టర్స్ విడుదల చేశాడు వర్మ. పైగా దానికి తన ట్విట్టర్ లో ప్రమోషన్ ఒకటి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు పవన్ అభిమానులకు మంట పుట్టిస్తున్నాయి. ఇక ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోస్టర్స్ వాటికి పెట్రోల్ పోస్తున్నాయి. వర్మను ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్ని పోస్టర్స్ విడుదల చేస్తాడో అని అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు. 

మరోవైపు వర్మ తీస్తున్న ఈ పవర్ స్టార్ గురించి పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. అనవసరంగా వర్మ గురించి ఆలోచించి తన విలువైన సమయాన్ని వృధా చేసుకోనని పవన్ తన సన్నిహితులతో చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. తన ఇష్టం వచ్చినట్టు తీసుకోని.. ఆ సినిమా వల్ల తనకు పోయేదేం లేదు అని పవన్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ అలసత్వాన్ని వర్మ  ఉపయోగించుకుంటున్నాడు. రోజురోజుకు రెచ్చిపోతున్నారు మరి ఇది ఎక్కడ ఆగుతుందో చూడాలి. 

More Related Stories