English   

టెలివిజన్ యాంకర్స్ తో వ్యభిచారం.. మచిలీపట్నంలో భారీ సెక్స్ రాకెట్..

TV Anchors
2020-07-14 07:54:05

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఉపాదికి కేరాఫ్ అడ్రస్. కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ బతుకుతుంటారు.. కానీ అదే క్రమంలో కొన్ని అసాంఘీక కార్య కలాపాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యభిచారం, సెక్స్‌కు అడ్డాగా మారిపోతుంది ఇండస్ట్రీ. తాజాగా ఇక్కడ మరో సెక్స్ రాకెట్ బయటపడింది. మొన్నటికి మొన్న ఓ టాలీవుడ్ నటి వ్యభిచార గుట్టు రట్టైంది. ఇప్పుడు మరో సెక్స్ రాకెట్ కూడా బయటికి వచ్చింది. మచిలీపట్నంలోని ఓ పెద్ద హోటల్లో వ్యభిచార దందా నడుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా బేగంపేట, బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లోని కొన్ని హోటల్స్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. ఇప్పుడు మచిలీపట్నంలో కూడా ఇలాంటి ఒక భారీ సెక్స్ రాకెట్ బయటకు వచ్చింది. అక్కడి ప్రముఖ హోటల్‌లో తెలుగు యాంకర్స్ తో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సిటీ లోని ఒక పెద్ద హోటల్ తో పాటు  ఊరికి దూరంగా ఉన్న ఇండివిడ్యువల్ హౌస్ లలో కూడా  ఈ వ్యభిచార దందా నడుస్తుందని స్థానికులు చెబుతున్నారు. 

సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసే అమ్మాయిలు.. అలాగే యాంకర్స్ ను వలగా వేసి అందినకాడికి దోచుకుంటున్నారు కొందరు స్వార్థపరులు. ఇండస్ట్రీలో వెలిగిపోదామని వచ్చిన అమ్మాయిలకు వలేసి కొందరు వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. మొన్నటికి మొన్న కూడా టాలీవుడ్ నటి ఒకరు హైదరాబాద్‌లో వ్యభిచార ఈవెంట్ నడిపిస్తూ దొరికేసింది. ఇప్పుడు మరోసారి ఇదే కథ జరుగుతుంది. సెక్స్ రాకెట్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తుండటంతో .. వారిని పట్టుకోవడం పోలీసులకు కూడా ఛాలెంజింగ్‌గా మారుతుంది. ముఖ్యంగా మచిలీపట్నంలో అయితే రాజకీయ నాయకులు కూడా టీవీ యాంకర్స్ తో రాసలీలలు జరుపుతున్నారు అంటూ స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న పెద్ద నగరాల నుంచి అమ్మాయిలను అక్కడికి తీసుకు వస్తున్నారు. ఒక రాత్రికి 10 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేస్తూ దందా నడిపిస్తున్నారు అంటూ అక్కడ జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు.

More Related Stories