కరోనా బారిన పడిన మరో బుల్లితెర నటుడు

తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా వైరస్ భయపెడుతోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా భారిన పడటం ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా బుల్లి తెర వారికి కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు టీవీ నటీనటులకు కరోనా పాజిటివ్ రాగా తాజాగా మరో నటుడికి పాజిటివ్ వచ్చింది. తాజాగా బుల్లితెర నటుడు భరద్వాజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. స్వాతిచినుకులు, మొగలిరేకులు, బంధం అనే టీవీ సీరియళ్ల ద్వారా భరద్వాజ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఈ విషయనికి సంబంధించి భరద్వాజ్ ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్టు చేశారు. తనకు లక్షణాలేవి లేవన్న ఆయన సరైన ఆహార నియమాలు, మందులతో వ్యాధి నుంచి బయట పడచ్చని పేర్కొన్నారు. ఇక తనతో కలిసి నటించిన వాళ్ళు ఐసోలేషన్లో ఉండాలని, టెస్టులు చేయించుకోవాలని భరద్వాజ్ కోరారు. ఇప్పటి దాకా నవ్య స్వామి, రవికృష్ణ, సాక్షి శివ, ప్రభాకర్ వంటి పలువురు బుల్లితెర నటులు కరోనా బారిన పడి కోలుకుంటున్నారు.