పుష్ప నుండి అందుకే తప్పుకున్నానన్న సేతుపతి

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ అని ముందు నుండి ప్రచారం జరిగింది. అయితే గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించనున్నాడని క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాని బన్నీ కెరీర్ లో మొదటిసారిగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో అంటే ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో సౌత్, నార్త్ ఇండస్ట్రీకి సంబంధించి పలువురు ప్రముఖులని ఎంపిక చేశారు. విలన్స్ విషయంలో పలు ప్రచారాలు జరుగుతున్నా ఒక విషయం అయితే క్లియర్ అదే ఈ సినిమాలో ఒక కీలక పోలీసాఫీసర్ పాత్ర కోసం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకున్నారు. అయితే ఆయన ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఇందులో వివాదాలు లాంటివి అయితే ఏవీ లేవని కేవలం డేట్లు సర్దుబాటు కాకనే ఆయన తప్పుకున్నాడని అంటున్నా ఆ విషయంలో మరో కోణం కూడా తెరమీదకు వచ్చింది. అదెంటంటే ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కడమేనట.
ఎందుకంటే ఈ సినిమా అనుకున్నప్పుడు పాన్ ఇండియా ఆలోచన లేదు. అందువల్ల నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినా సరే విజయ్ ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుండడంతో తమిళంలో అల్లు అర్జున్ మొదటి సినిమా అవుతుంది కాబట్టి, ఒక డెబ్యూ హీరో సినిమాలో ఇప్పటికే న్నో తమిళ సినిమాల్లో హీరోగా కనిపించిన తను విలన్ గా చేయడం వల్ల అక్కడి తన కెరీర్ కి ఇబ్బంది అవుతుందేమోనని ఈ సినిమా నుండి తప్పుకున్నాడని అన్నారు. అయితే తాజాగా విజయ్ సేతుపతి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన ఆయన తను పుష్ప చిత్రం నుంచి తప్పుకున్నది వాస్తమేనని తెలిపారు. డేట్స్ కుదరకపోవడం వల్లే తను ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్టు వెల్లడించారు. సినిమా చేయాలని తనకున్నప్పటికీ.. తన డేట్స్ వల్ల షూటింగ్కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన క్లారిటీ ఇచ్చారు.