నెల రోజులకి స్పందించిన సుశాంత్ మాజీ ప్రేయసి

బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణించి నేటికి సరిగ్గా నెల. ఆరోజు నుండి ఆయన మరణానికి కారణం వీరే అని చాల మందిని ఆయన అభిమానులు ఆడుకున్నారు. ఇక ఆయన చనిపోయి నెల రోజులు గడుస్తున్న సందర్భంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు సుశాంత్‌కి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సుశాంత్ మృతిపై స్పందించని సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకిత లోఖండే సుశాంత్ మరణం గురించి మొదటిసారి సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ఇన్స్టాగ్రామ్ లో దీపం పిక్ షేర్ చేస్తూ.. గాడ్ చైల్డ్ అని కామెంట్ పెట్టింది అంకిత.
సుశాంత్ మరణించిన తర్వాత అంకిత తన తల్లితో కలిసి సుశాంత్ ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులని పరామర్శించింది. 2009లో హిందీలో వచ్చిన పవిత్ర రిశ్తా ( పవిత్ర సంబంధం) అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యాడు సుశాంత్. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సీరియల్లో సుశాంత్ ప్రధాన పాత్ర పోషించి టీవీ ఆడియెన్స్‌ని మెప్పించాడు. ఇదే సీరియల్లో తనకి జోడీగా నటించిన అంకిత లోఖండేతో సుశాంత్ ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లపాటు కొనసాగిన వీరి ప్రేమాయణం 2016లో బ్రేక్ అయింది. అయితే అంకితతో బ్రేక్ అప్ కి సుశాంత్ అసలు ఇష్టపడలేదని సమాచారం. ఆమె ప్రేమించినంతగా తనను ఎవరూ ప్రేమించలేరని సుశాంత్ తన సైక్రియాటిస్టుకి చెప్పినట్లు సమాచారం.