ప్రభాస్ సరసన దీపిక ఒప్పుకున్నట్టేనా..

మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టడం మన వాళ్ళకి తెలిసినంత బాగా ఇంకా ఎవరికీ తెలియదేమో. ఇప్పుడు ఈ సామెత ఎందుకు అంటే ఈ మధ్య ‘‘మహానటి’ సినిమా చూశా... చాలా బాగుంది మీరు కూడా చూడండి’ అంటూ బాలీవుడ్ నటి దీపిక ఇటీవల తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీపిక తెలుగు సినిమా చూసిందబ్బ అని కొందరు గర్వంగా ఫీల్ అయితే మరి కొందరు ఏమో ఏకంగా ప్రభాస్ తో నటిస్తుందని మొదలెట్టారు. ఈ ప్రచారం ఎందుకో ఇప్పటికే అర్ధం అయి ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ తర్వాతి సినిమాకు ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకుడు కావడం.
అయితే దీపికను అసలు ప్రభాస్ సినిమా కోసం సంప్రదించారా లేదా అనే విషయంలోనే ఇంకా స్పష్టత లేకున్నా ఆ సినిమాకు దీపిక రెమ్యూనరేషన్ ఇదీ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు ప్రభాస్ చేస్తోన్న రాధే శ్యాం సినిమా తరువాత ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ పాన్ వరల్డ్ సినిమా రూపొందిస్తామని వైజయంతి మూవీస్ కొన్నాళ్ళ క్రితం ప్రకటించింది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో బాలీవుడ్ హీరోయిన్ నటించనుందని ముందు నుండే అంటున్నా ఈ మహానటి ఆ మహానటి ప్రస్తావన తీసుక్రవడంతో ఆమెనే హీరోయిన్ అనడం మొదలయింది. అయితే వాస్తవానికి కూడా యూనిట్ దీపికను సంప్రదించిందట. కానీ రేమ్యునరేషన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదట. చూడాలి మరి ఏమవుతుందో ?